
ఒకానొక్కప్పుడు అంటే 1970 దశకంలో ఆంధ్రప్రదేశ్‌లో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు. అతని జీవిత కధ ఆధారంగా అదే పేరుతో మాస్ మహారాజ రవితేజ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నట్లు రవితేజ స్వయంగా ఇవాళ్ళ ట్విట్టర్‌లో ప్రకటిస్తూ రిలీజ్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజకు జోడీగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఇంకా మండవ సాయి కుమార్, ముఖేష్ చబ్ర, ప్రవీణ్ దాచారం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మళ్ళీ చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 14వ తేదీన టైగర్ నాగేశ్వరరావు విడుదల కాబోతోంది. ఈ సినిమాకి డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, కెమెరా: ఆర్ మాధే, సంగీతం: జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.
సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ, అనూ ఎమ్మాన్యుయేల్, ఫారియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్న రావణాసుర సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది.