ముగ్గురిలో ఓటెవరికో..!

ఇజం సినిమా రిజల్ట్ తో సగం సంతోషంగా ఉన్న కళ్యాణ్ రాం ఇక లేట్ చేయకుండా తన తదుపరి సినిమా విషయంలో డెశిషన్ తీసుకోబోతున్నాడట. అయితే ప్రస్తుతం తనతో పటాస్ డైరక్టర్ ఓ కథతో సిద్ధమయ్యాడట. కళ్యాణ్ రాం ఓకే అంటే సినిమా తీసేయడమే అంటున్నాడట. ఇక అదే క్రమంలో శ్రీరస్తు శుభమస్తుతో హిట్ అందుకున్న పరశురాం కూడా కళ్యాణ్ రాం కు కథ వినిపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. 

ఇక ఈ ఇద్దరు కాకుండా ప్రస్థానం డైరక్టర్ దేవా కట్టా కూడా నందమూరి హీరో కోసం కథ సిద్ధం చేస్తున్నాడట. మరి ఈ ముగ్గురిలో కళ్యాణ్ రాం ఎవరికి ఓటేస్తాడు అనేది చూడాలి. ఇజం తో తన క్యారక్టరైజేషన్ లో చేంజెస్ చూపించిన కళ్యాణ్ రాం కరెక్ట్ కథ పడితే మాస్ ఆడియెన్స్ కు రీచ్ అవడం పెద్ద విషయమే కాదని తేలింది. సో మొత్తానికి ఇజం హిట్టా ఫట్టా అన్నది పక్కనపెడితే కళ్యాణ్ రాం మేకోవర్ మాత్రం కచ్చితంగా తర్వాత సినిమాలకు ఉపయోగపడుతుంది. ఆ క్రమంలో తన దగ్గరకు కథలను పట్టుకొచ్చిన ఈ ముగ్గురిలో బాగా నచ్చిన స్టోరీని ఓకే చేసి సినిమా చేస్తాడట. మరి ఆ లక్కీ డైరక్టర్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.