
స్వీటీ అనుష్క, జాతిరత్నం నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు మహేష్ బాబు ‘మిస్ శెట్టి మిస్టర్ శెట్టి’ పేరుతో మంచి కామెడీ సినిమాను సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాలోని నో.. నో... నో … అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని బుదవారం విడుదలైంది. అనంత్ శ్రీరామ్ వ్రాసిన ఈ పాటకు రాధన్ ‘రాప్ స్టైల్లో’ స్వరపరచగా దానిని ఎంఎం.మానసి బృందం ఆలపించారు. ఈ పాట సంగీతం, ఆలపించిన తీరు చాలా విలక్షణంగా అందరినీ ఆకట్టుకొంటున్నాయి.
యూవీ క్రియెషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వేసవిలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం మహేష్ బాబు పి, సంగీతం: రాధన్, కెమెరా: నీరావ్ షా, కొరియోగ్రఫీ: రాజు సుందరం మాస్టార్.
ఎప్పటికైనా విదేశాలకు వెళ్ళి స్థిరపడాలని హైదరాబాద్‌లో పగటి కలలు కనే హీరో నవీన్ పోలిశెట్టి, లండన్‌లో ఓ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న అనుష్క శెట్టిల మద్య జరిగే రొమాంటిక్ కామెడీ ఏవిదంగా ఉంటుందో చూడాల్సిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ లిరికల్ వీడియో సాంగ్ చాలా వెరైటీగా అందరినీ ఆకట్టుకొంటోంది.