
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరం తేజ్, సంయుక్త మేనన్ జంటగా నటిస్తున్న విరూపాక్ష చిత్రం ఈ వేసవిలో విడుదల కాబోతోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచిస్పందనే వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంయుక్త చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. నిన్న ఉగాది పండుగకు నా పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేస్తానన్నారు కదా?ఎందుకు విడుదల చేయలేదు. నేను చాలా నిరాశ చెందాను. నిర్మాణ సంస్థ ఎస్‌విసిసి ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది?అని ట్వీట్ చేసింది.
ఆమె ట్వీట్‌పై నిర్మాణ సంస్థ వెంటనే స్పందిస్తూ, “జరిగిన పొరపాటుకు క్షమాపణలు. త్వరలోనే విడుదల చేస్తాము,” అని జవాబు ఇచ్చింది. అందుకు ఆమె ఓకే అంటూ కొన్ని ఇమోజీలతో తిరిగి జవాబు చెప్పింది.
సుకుమార్ రైటింగ్స్ తో కలిసి శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి స్క్రీన్ ప్లే: సుకుమార్, సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్, సంగీతం: బి.అజనీష్ లోకనాధ్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.