ఉగాదికి దసరా గిఫ్ట్ ఇచ్చిన నాని

నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన దసరా సినిమా నుంచి నేడు ఉగాది పండుగ సందర్భంగా ధూంధాం దోస్తాన్... అంటూ సాగే మరో మాస్ బీట్ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేశారుతెలంగాణ మాండలికంలో కాసర్ల శ్యామ్ వ్రాసిన ఈ పాటను సంతోష్ నారాయణ్ ఆ ఫీల్ కలిగేలా స్వరపరిచారు. రాహుల్ సిప్లీగంజ్, గొట్టే కనకవ్వ తదితరులు ఈ పాటను అంతే హుషారుగా పాడారు. సింగరేణి బొగ్గు గనులు నేపధ్యంలో సాగే కధాంశంతో తీసిన సినిమా కనుక ఆ బొగ్గు, దుమ్ముధూళి మద్యనే ఈ పాటని చిత్రీకరించారు. అది చూసినప్పుడు నాని ఈ సినిమా కోసం ఎంతగాశ్రమిస్తున్నాడో కళ్ళకు కట్టిన్నట్లు కనబడుతుంది.

ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్, రోషన్ మాథ్యూస్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. అయితే ఇటువంటి కధాంశంతో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.  

ఈ సినిమాకి ఎడిటింగ్: నవీన్ నూలి, సంగీతం: సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ అందించారు. ఈ మార్చి30వ తేదీన దసరా సినిమా వస్తోంది.