
మాస్ మహారాజ రవితేజ, అనూ ఎమ్మాన్యుయేల్, ఫారియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా రావణాసుర. ఈ సినిమా నుంచి ఇదివరకే “దశకంఠ రావణా... రావణా..” అనే రావణాసుర యాంథమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. తాజాగా “వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే...” అంటూహుషారుగా సాగే మరో లిరికల్ వీడియో సాంగ్‌ని చిత్రబృందం బుదవారం విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి చనిపోయే ముందు వ్రాసిన ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచగా, అనురాగ్ కులకర్ణి హుషారుగా ఆలపించారు.
ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ నామతో కలిసి రవితేజ తమ రవితేజ టీమ్ వర్క్స్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి దర్శకత్వం: సుధీర్ వర్మ, కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీంస్ శిశిరోలియో, ఫోటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఆర్ట్: డిఆర్‌కె కిరణ్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. రావణాసుర సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది.