
నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కించిన దసరా సినిమా ఈనెల 30వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేశ్ నటించింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున మంగళవారం దసరా ట్రైలర్ కూడా విడుదల చేశారు. నాని, కీర్తి సురేష్ ప్రేమ సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ట్రైలర్‌లో స్పష్టం అయ్యింది కానీ సినిమాలో హింస, రక్తపాతం భీభత్సంగా ఉండబోతోందని ట్రైలర్ సూచిస్తోంది. ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్, రోషన్ మాథ్యూస్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. తొలిసారిగా నాని కెరీర్‌లో ఈ సినిమాని రూ.65కోట్ల బారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమాకి ఎడిటింగ్: నవీన్ నూలి, సంగీతం: సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ అందిస్తున్నారు.