కిరణ్ అబ్బవరం మీటర్‌ టీజర్‌... మాస్ మీటర్

‘వినరో భాగ్యము విష్ణు కధ’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న కిరణ్ అబ్బవరం వెంటనే రమేష్ కాదూరి దర్శకత్వంలో ‘మీటర్’ అనే మరో సినిమాతో ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్‌ చూస్తే పక్కా కమర్షియల్ మూవీ అని అర్దమవుతుంది. ఎవరినీ లెక్కచేయని పోలీస్ ఆఫీసరుగా కిరణ్ అబ్బవరం నటిస్తున్నాడు. హీరో పోలీస్ ఆఫీసర్ అయితే విలన్‌గా రాజకీయ నాయకుడో లేదా పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండాలనే ఫార్ములా దీనిలో ఫాలో అయ్యినట్లే ఉన్నారు. కనుక టీజర్‌లో పంచ్ డైలాగులు, ఫైట్స్ షరా మామూలే. 

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడీగా అతుల్య రవి నటించింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లపై తీశారు. ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రమేష్ కాడూరి, డైలాగ్స్: రమేష్ కాడూరి, సూర్య,  కెమెరా: వెంకట్ సి దిలీప్, సంగీతం: సాయి కార్తీక్ అందిస్తున్నారు.