ఈసారి క్రైమ్ థ్రిల్లర్ మూవీతో వస్తున్న శర్వానంద్

శర్వానంద్ వరుసపెట్టి సినిమాలు చేసే రకం కాదు. కాస్త ఆలస్యమైన భిన్నమైన కధలను ఎంపికచేసుకొని చేస్తుంటాడు. గత ఏడాది సెప్టెంబర్‌ ‘ఒకే ఒక జీవితం’ ఇందుకు ఓ ఉదాహరణ. ఆరు నెలల తర్వాత ఈసారి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో తన 35వ సినిమాకు శర్వా ఒకే చెప్పేశాడు. ఇక శ్రీరామ్ ఆదిత్య ట్రాక్ రికార్డు కూడా భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ వంటి సినిమాలతో అద్భుతంగానే ఉంది. కనుక వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని ఆశించవచ్చు. 

మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ వీడియో క్లిప్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ శర్వానంద్ #35 సినిమా మొదలైన్నట్లు ప్రకటించారు. దీనిని లండన్‌ నగరంలో తీసినందున ఈ సినిమాలో కొంత కధ అక్కడే జరిగిన్నట్లు భావించవచ్చు.         

ఈ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: హేషం అబ్దుల్ వాహబ్, సినిమాటోగ్రాఫర్: విష్ణు శర్మ, ఎడిటర్: ప్రవీణ్ పూడి. త్వరలోనే ఈ సినిమాకి సంబందించి పూర్తి వివరాలు తెలియజేస్తామని నిర్మాత చెప్పారు.