కార్తికేయ గుమ్మకొండ, నేహాశెట్టి జంటగా బెదురుకొండ-2012 అనే విలక్షణమైన టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అజయ్ ఘోష్, సత్యా, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్‌ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి పార్వతి, కిట్టయ్య,, అనితానాథ్, దివ్యా నార్ని ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాలోని వెన్నెల్లో ఆడపిల్లా... కవ్వించే కన్నెపిల్లా.. అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని ఈరోజు విడుదల చేశారు. కిట్టూ విస్సాప్రగడ వ్రాసిన ఈ పాటకు మణిశర్మ సంగీతం స్వరపరచగా, దానిని హారిక నారాయణ్, జెవి సుధాంశు మృధుమధురంగా
ఈ సినిమాను ముప్పనేని రవీంద్ర బెనర్జీ లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: తమిళిసై సౌందరరాజన్ ప్రకాష్-సన్నీ, కొరియోగ్రఫీ: బృంద మాస్టర్, స్టంట్స్: అంజి, పృధ్వీ రాజ్, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, సంగీతం: మణిశర్మ అందిస్తున్నారు.
ఆలపించారు.
గోదావరి జిల్లాల నేపద్యంలో అనేక రూరల్ డ్రామా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అటువంటిదే కానీ దీనిలో పుష్కలంగా కామెడీ కూడా ఉంటుందని నిర్మాత ముప్పనేని రవీంద్ర బెనర్జీ తెలిపారు. ఈ నేపధ్యంతో వచ్చిన సినిమాలలో అత్యుత్తమంగా తమ బెదురులంక-2012 సినిమా నిలుస్తుందని భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పారు.