వెంకటేష్, రానాలను చాలా సినిమాలలో చూశాము కానీ వెబ్ సిరీస్‌లో నటించగా చూడలేదు. ఇప్పుడు ఆ ముచ్చటా తీరబోతోంది. వారిద్దరూ తండ్రీకొడుకులుగా నటించిన రానానాయుడు అనే వెబ్ సిరీస్ ఈ నెల 10వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలో ప్రసారం కాబోతోంది. అమెరికాలో సూపర్ హిట్ అయిన ‘రే డొనోవాన్’కి హిందీ రీమేక్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం దీనిని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకులు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ వర్మ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం చేశారు.
దీనిలో వెంకటేష్ నాగ నాయుడుగా, రానా ఆయన కొడుకు రానా నాయుడుగా చేశారు. దీనిలో ఇంకా సుచిత్ర పిళ్ళై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆదిత్య మేనన్, ప్రియా బెనర్జీ తదితరులు నటించారు. ఈ యాక్షన్ క్రైమ్ వెబ్ సిరీస్‌కు కెమెరా: జయకృష్ణ గుమ్మడి, సంగీతం: సంగీత్-సిద్దార్థ్ అందించారు.