నందమూరి కుటుంబం నుంచి మరో హీరో... మోక్షజ్ఞ కాదు!

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి హరికృష్ణ, బాలకృష్ణ వారి తర్వాత జూ.ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్ తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చారు. తాజాగా నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ బ్రీత్ అనే సినిమాతో త్వరలో వస్తున్నారు. దీని సబ్ టైటిల్‌ ‘అంతిమ పోరాటం’. రక్ష, జక్కన్న సినిమాలకు దర్శకత్వం వహించిన ఆకెళ్ళ వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. బసవతారకం క్రియెషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్: 1గా తెరకెక్కిస్తున్న బ్రీత్ సినిమాను నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్నారు.   

నందమూరి కళ్యాణ్ రామ్‌ ఆదివారం హైదరాబాద్‌ ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సినిమాకు ఫోటోగ్రఫీ: రాకేష్ హోస్మనీ, సంగీతం : మార్క్ కె.రాబిన్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని కళ్యాణ్ రామ్ చెప్పారు.

బాలకృష్ణ అభిమానులందరూ ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఎప్పుడు ఇండస్ట్రీలోకి వస్తాడా అని ఎదురుచూస్తుంటే, అనూహ్యంగా కొత్త బ్యానర్‌తో జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ ఎంట్రీ ఇచ్చారు.