బింబిసార సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్‌ని తర్వాత చేసిన అమిగోస్ సినిమా దెబ్బేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా కధపై చాలా నమ్మకంతో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఓ బిజినెస్ మ్యాన్ కొడుకుగా, బెంగళూరుకు చెందిన మంజూనాధ్ అనే ఓ యువకుడిగా, ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్‌గా మూడు విభిన్నమైన పాత్రలు (ట్రిపుల్ రోల్) చేశారు. సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా మైఖేల్ పాత్రకి. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్ 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో ఆషికా రంగనాధ్ తారకరత్నకి జోడీగా నటించింది. ఈ సినిమాకి సంగీతం: జీబ్రాన్, ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ అందించారు.