షూటింగ్‌లో సమంతకి గాయాలు... అయినా ఓకే!

సమంత మయొసైటిస్ వ్యాధి నుంచి కోలుకోగానే రాజ్‌-డీకే దర్శకత్వంలో సిటాడెల్ అనే వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొంటోంది. ఇది కూడా ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌లాగే యాక్షన్ వెబ్‌ సిరీస్‌. కనుక దీనిలో యాక్షన్ సీన్స్ కోసం సమంత చాలా కష్టపడుతోంది. సిటాడెల్ షూటింగ్‌లో యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు సమంత రెండు చేతులకి గాయాలయ్యాయి. ఆ ఫోటోని ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోగా, వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ కోసం సమంత అంత కష్టపడుతున్నందుకు నెటిజన్స్ ఆమెపై ప్రశంశలు కురిపిస్తున్నారు. దీనిలో కొన్ని యాక్షన్ సీన్స్ మంచులో మైనస్ 8 డిగ్రీలలో సమంత డూప్ లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడే ఈ గాయాలైయ్యాయి. ఈ వెబ్‌ సిరీస్‌లో సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ శకుంతల దుష్యంతులుగా నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. ఈ సిటాడెల్ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ పూర్తి కాగానే, శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండతో కలిసి ఖిశీ సినిమా చేయవలసి ఉంది.