మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్ జంటగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న రిలీజ్ అయ్యింది. చిరంజీవి వీరాభిమాని బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేర్ వీరయ్య పక్కా మాస్ మసాలా సినిమా అయినప్పటికీ, చాలా రోజుల తర్వాత చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకొంటున్నారో దర్శకుడు బాబీ సరిగ్గా అలా చూపడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా సినిమాలో చిరంజీవి డ్యాన్స్, పాటలు, కామెడీ టైమింగ్ చూసి అభిమానులు పొంగిపోయారు. కనుక వాల్తేర్ వీరయ్య కోసం ఇన్నాళ్లుగా ఓటీటీ ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించి వాల్తేర్ వీరయ్య సినిమా సోమవారం అంటే ఫిభ్రవరి 27 నుంచి నెట్ఫ్లిక్స్లో విడుదలై అందరినీ అలరిస్తోంది.
చిరంజీవి వాల్తేర్ వీరయ్య పూర్తిచేయగానే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ అనే సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిం. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా, చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఇంకా మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ.