అల్లరి నరేష్‌ ఉగ్ర రూపం చూశారా?

ఒకప్పుడు కామెడీ సినిమాల హీరోగా నరేష్‌ అల్లరి నరేష్‌గా మంచి పేరే సంపాదించుకొన్నాడు. అయితే మద్యమద్యలో సీరియస్ కధాంశాలు చేసి అటువంటి సినిమాలు కూడా చేయగలదని నరేష్ మంచి గుర్తింపే సంపాదించుకొన్నాడు. మహర్షి సినిమాలో హీరో మహేష్ బాబుకి స్నేహితుడి పాత్ర చేయగా, నాంది సినిమాలో చేయని నేరానికి జైలులో చిక్కుకొన్న అండర్ ట్రయల్ పాత్ర చేసి మెప్పించాడు. ఇటీవల విడుదలైన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలో ఎలక్షన్స్ ఆఫీసరుగా డ్యూటీ పడిన తెలుగు టీచర్ పాత్రతో ప్రేక్షకులని మెప్పించాడు.

తాజాగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం అనే సినిమాలో పోలీస్ ఆఫీసరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్‌లో నరేష్ పోలీస్ ఆఫీసరుగా నిజంగానే ఉగ్రరూపం చూపించాడు. ఎప్పుడూ తన కామెడీతో ప్రేక్షకులకి కితకితలు పెట్టే నరేష్ ఉగ్రరూపం చూస్తే 60 సినిమాల అనుభవంతో నటుడిగా చాలా ఎదిగాడనిపిస్తుంది. 

ఈ సినిమాలో నరేష్‌కి భార్యగా మిర్నా నటించింది. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కథ: తూము వెంకట్, డైలాగ్స్: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం,: విజయ్‌ కనకమేడల, ఎడిటర్ : చోటా కె. ప్రసాద్, సంగీతం: శ్రీచరణ్ పాకాల అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదలకాబోతోంది.