అల్లరి నరేష్ చెప్పిన ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలు..!

లవర్ బోయ్ గా కెరియర్ మొదట్లోనే హిట్లు కొట్టి ఆ తర్వాత ఫ్లాప్స్ ఫేజ్ చేసి చివరకు ఆత్మహత్య చేసుకున్న ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలను అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. తనతో స్నేహంగా ఉండే ఉదయ్ కిరణ్ సడెన్ గా చనిపోవడం చాలా బాధ అనిపించిందని. ఇక తను చనిపోయే ముందు రోజే తనతో మాట్లాడాడని. ఆరోజు ఎందుకో తను డల్ గా కనిపిస్తే ఏమైంది ఎందుకలా ఉన్నావని అడిగితే ఆరోజు పేపర్ లో ఓ ఆర్టికల్ చూపించాడట. ఓ యువ కథానాయకుడు కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని రాశారు. దానికి ఏముందు అది నీ గురించి కాదు కదా అంటే.. ఆ ఆర్టికల్ చివర ఇలా చేస్తే చివరకు ఉదయ్ కిరణ్ లానే ఫేడవుట్ కావాల్సి వస్తుంది అన్నట్టు ప్రస్తావించారట.   

అయితే ఆ మాటకు తనని ఏం చెప్పి కన్విన్స్ చేయాలో అర్ధం కాక షాక్ అయ్యాడట అల్లరి నరేష్. హిట్ వస్తే ఆకాశానికెత్తడం ఫ్లాప్స్ వస్తే వారే చిన్నచూపు చూస్తారని అన్నాడు. మరి అల్లరి నరేష్ చెప్పింది నిజమే అయినా హిట్ ఫ్లాప్ లు సమతూకంగా కెరియర్ ప్లాన్ చేసుకుంటే అలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అయినా టైం కలిసి రాకపోతే ఎవరం ఏం చేయలేం. చాలా రోజుల తర్వాత తన మాటల్లో ఉదయ్ కిరణ్ ను ప్రస్తావించి ఉదయ్ కిరణ్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు అల్లరి నరేష్.