అమెజాన్ ప్రైమ్‌లో విజయ్‌ వారసుడు వచ్చేస్తున్నాడు

ప్రముఖ కోలీవుడ్‌ హీరో విజయ్‌, రష్మిక మందన జంటగా నటించిన వారసుడు (తమిళంలో వారిసు) సూపర్ హిట్ అయ్యింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ విషయం అమెజాన్ ప్రైమ్‌ సంస్థ స్వయంగా ప్రకటించింది. ఈ నెల 22వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో వారసుడు తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో విడుదల కాబోతున్నట్లు ప్రకటించింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ తొలిసారిగా ఈ సినిమాలో నటించాడు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాని నిర్మించారు. వారసుడు చాలా రొటీన్ కధే అయినప్పటికీ వంశీ పైడిపల్లి దానిని మలిచిన తీరు, విజయ్‌ నటన కలిపి సినిమాని నిలబెట్టాయని చెప్పవచ్చు. సంక్రాంతి పండుగ సమయంలో సినిమా రిలీజ్‌ విషయంలో తలెత్తిన వివాదాలు కూడా సినిమాకి ఫ్రీగా పబ్లిసిటీ కల్పించడం ద్వారా సినిమా హిట్ అవడానికి మరింత తోడ్పడ్డాయని చెప్పవచ్చు.