మయో సైటీస్ అనే అరుదైన వ్యాధి బారినపడి కోల్కోన్న సమంత ఇప్పుడు మళ్ళీ షూటింగ్‌లు, సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. యశోద తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ సినిమా మొదలుపెట్టవలసి ఉన్నప్పటికీ ముందుగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ మొదలుపెట్టింది. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ అందించిన దర్శకులు రాజ్ అండ్ డికె దీనికి దర్శకులు. దీని తర్వాత ఖుషీ సినిమా మొదలుపెడతానని సమంత తెలిపింది.
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఆ బాధలో నుంచి బయటపడేందుకు సమంత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటోంది. రెండు రోజుల క్రితమే తమిళనాడులోని ఫలణిలో మురుగన్ ఆలయంలో 600 మెట్లపై దీపాలు వెలిగిస్తూ మెట్ల పూజ కార్యక్రమంలో పాల్గొంది.
కాస్త కోలుకొన్నప్పటి నుంచి సమంత మళ్ళీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యింది. అయితే ఇప్పుడు స్పూర్తిదాయకమైన కొటేషన్స్ ఎక్కువగా పోస్ట్ చేస్తోది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా తన ఫోటోతో “ఎవరు ఏ సమస్యలతో పోరాడుతున్నారో మనకి తెలియదు. కనుక అందరితో దయతో వ్యవహరించండి,” అంటూ అభిమానులకి, ప్రజలందరికీ విజ్ఞప్తి చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన పౌరాణిక ప్రేమ కావ్యం శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.