రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తిచేయగానే శంకర్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించి, ఆ సినిమాని కూడా చాలా వరకు పూర్తి చేసేశాడు. శంకర్‌తో సినిమా చేస్తుండగానే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానతో సినిమాకి ఒకే చెప్పేశాడు. కనుక శంకర్ దర్శకత్వంలో ఆర్‌సీ15 వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్న సినిమా పూర్తికాగానే బుచ్చిబాబుతో సినిమా మొదలుపెట్టేయబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా ప్రీ--ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. బహుశః మే లేదా జూన్‌లోగా రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావచ్చని తాజా సమాచారం. ఈరోజు బుచ్చిబాబు పుట్టినరోజుకి రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలుపుతూ “త్వరలోనే సెట్స్‌లో కలుద్దాం,” అంటూ ట్వీట్‌పై చేయగా, బుచ్చిబాబు స్పందిస్తూ,”నాపై మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటా. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నా,” అంటూ జవాబిచ్చారు.
రామ్ చరణ్-శంకర్ సినిమా షూటింగ్ ఇటీవలే కర్నూలులోని కొండారెడ్డి బురుజువద్ద జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ తంద్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రి పాత్రలో రామ్ చరణ్‌కు జోడీగా అంజలి, కొడుకు పాత్రకు జోడీగా కియరా అద్వానీ నటిస్తున్నారు. ఎస్.జే. సూర్య, సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
దాదాపు రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు అందించిన కధతో రూపొందున్న ఈ సినిమాకు ‘అధికారి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. కెమెరా తిరు, ఆర్ రత్నవేలు, థమన్ సంగీతం అందిస్తున్నారు.