శకుంతల,దుష్యంతుల పౌరాణిక ప్రేమ గాధ ఆధారంగా నిర్మింపబడుతున్న శాకుంతలం సినిమా నుంచి “మధుర గతమా... కాలాన్నే ఆపకా... “అంటూ సాగే నాలుగో లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. శ్రీమణి వ్రాసిన ఈ పాటకి మణిశర్మ స్వరపరచగా అర్మాన్ మాలిక్, శ్రేయ గోశల్ మధురంగా ఆలపించారు.
ఈ సినిమాలో శకుంతల, దుష్యంతులుగా సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య, అల్లు అర్జున్ కుమార్తె అర్హ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ నీలిమ గుణ ఈ సినిమాను గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 14వ తేదీన శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.