ప్రభాస్‌-కృతి పెళ్ళి చేసేయొద్దు... ఇకచాలు ఆపండి!

గత కొన్ని రోజులుగా ప్రభాస్‌, కృతి సనన్ పెళ్ళి చేసుకోబోతున్నారని, త్వరలోనే మాల్దీవులలో వారి వివాహ నిశ్చితార్దం జరుగబోతోందని సోషల్ మీడియాలో ఒకటే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ సమయంలో వారిరువురూ ప్రేమలో పడ్డారనే ఊహాగానాలు చాలా కాలంగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా వారి వివాహ నిశ్చితార్దం కూడా ఖాయం చేసేస్తుండటంతో ప్రభాస్‌ మేనేజర్ కలుగజేసుకొని అవన్నీ వట్టి పుకార్లే. ప్రభాస్‌-కృతి సనన్ కేవలం మంచి స్నేహితులు మాత్రమే. వారిద్దరూ పెళ్ళి చేసుకోవడం లేదు. కనుక ఈ ఊహాగానాలకి స్వస్తి పలకమని విజ్ఞప్తి చేశారు. 

ప్రభాస్‌ గత మూడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నారు. జ్వరం కారణంగా సినిమా షూటింగ్‌లు కూడా రద్దు చేసుకోవలసి వచ్చింది. ఇటువంటి సమయంలో కృతీ సనన్‌తో వివాహ నిశ్చితార్ధం చేసేస్తుండటం ఆశ్చర్యకరమే కదా?ఇప్పటికైనా ప్రభాస్‌ మేనేజర్ మేల్కొని ఈ ఊహాగానాలని ఖండించారు లేకుంటే సోషల్ మీడియాయే పూనుకొని వారికి పెళ్ళి చేసేసి హనీమూన్ కూడా పంపించేసేదేమో?