కోలీవుడ్ అగ్ర నటులలో ఒకడైన ధనుష్ ‘సార్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా కార్పొరేట్ కాలేజీల దోపిడీ కధాంశంగా వస్తునట్లు ట్రైలర్ చూస్తే అర్దమవుతుంది. దీనిలో ధనుష్ ఓ లెక్చరర్ పాత్ర చేస్తున్నాడు. కాలేజీలో కుర్ర లెక్చరర్‌కి హీరోయిన్గా మరో అందమైన లెక్చరర్ సంయుక్త నటిస్తోంది. ట్రైలర్లో వారిద్దరి మద్య రొమాన్స్, కామెడీ, విలన్ పాత్రలో కార్పొరేట్ కాలేజీ యజమానిగా సముద్రఖనీతో పంచ్ డైలాగులు, విలన్ గ్యాంగ్‌ని హీరో ఒంటి చేత్తో విరగదీసేసే ఫైటింగ్ సీన్స్ అన్నీ ట్రైలర్లో చూపించేశారు. కనుక సినిమా కధ గురించి పెద్దగా ఆలోచించకుండా మాస్ మసాలా సినిమాలో ధనుష్ యాక్షన్, రొమాన్స్ చూసేందుకు వెళ్ళవచ్చు.
ఈ సినిమాలో సాయి కుమార్, తనికెళ్ళ భరణి, సముద్రఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీనివాస్, పమ్మి సాయి, హైపర్ ఆదీ, సార, ప్రవీణ, రాజేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి తమ సీతారా ఎంటర్టైన్మెంట్, ఫార్త్యూన్ సినిమా బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ ‘సార్’ సినిమాకి సంగీతం: జీవి ప్రకాష్ కుమార్, కెమెరా: యువరాజ్ అందిస్తున్నారు. ఈ సినిమా ఫిభ్రవరి 17వ తేదీన విడుదల కాబోతోంది.