మెగాస్టార్, శ్రుతీ హాసన్ జంటగా చేసిన వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13నా విడుదలై, ఊహించిన దానికంటే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో తీవ్ర నిరాశ చెందిన చిరంజీవికి, ఆయన అభిమానులకి ఈ సినిమా సూపర్ హిట్ అవడం చాలా సంతోషంగా ఉన్నారు.
కనుక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని ఓటీటీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి వాల్తేర్ వీరయ్య సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. చిరంజీవి చెప్పుకొన్నట్లు చాలా ఏళ్ళ తర్వాత మెగా అభిమానులని సంతృప్తి పరిచేవిదంగా ఈ సినిమా ఉంది. వాల్తేర్ వీరయ్యగా చిరంజీవి నటన, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, ఫైట్స్, డ్యాన్స్, మంచి మాస్ బీట్ పాటలు అన్ని చక్కగా కుదరడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. చిరంజీవి వీరాభిమాని బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో తన వంటి అభిమానులు చిరంజీవి నుంచి ఏమి కోరుకొంటారో సరిగ్గా అదే వాల్తేర్ వీరయ్య ద్వారా అందించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవడానికి ఇదీ మరో కారణమే!