ఆ పెళ్ళిళ్ళ గొడవేంటమ్మా పవన్‌ కళ్యాణ్‌?

బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్‌ టాక్ షోలో తర్వాత ఎపిసోడ్‌ పవన్‌ కళ్యాణ్‌తో చేసిన సంగతి తెలిసిందే. రెండు ఎపిసోడ్స్‌గా రాబోతున్న వారి అన్‌స్టాపబుల్‌ మొదటి ఎపిసోడ్‌ ప్రమోని ఆహా సంస్థ విడుదల చేసింది. దానిలో బాలయ్యతో పవన్‌ కళ్యాణ్‌ తొలిసారి కలిసిన విషయం, గుడుంబా శంకర్ సినిమాలో ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేయడం, దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్‌తో స్నేహం, మెగా కుటుంబంలో ప్రేమలు, అభిమానాలు, అలకలు వంటి అనేక అంశాలపై బాలయ్య ప్రశ్నలు సందిస్తూ హుషారుగా షో నడిపించారు. పవన్‌ కళ్యాణ్‌ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడం గురించి అడిగారు. ఈ మూడు పెళ్ళిళ్ళ గొడవ ఏమిటని కూడా పవన్‌ కళ్యాణ్‌ని అడిగేశారు. బాలయ్య ప్రశ్నలకి పవన్‌ కళ్యాణ్‌ ఏం సమాధానాలు చెప్పారనేది ఫిభ్రవరి 3న ప్రసారం కాబోయే అన్‌స్టాపబుల్‌ షోలో చూడవలసిందే. సాయిధరమ్ తేజ పంచె కట్టుకొని మద్యలో వచ్చి షోలో చేరడంతో ఈ ఎపిసోడ్‌ని బాలయ్య ఇంకా రక్తి కట్టించారు.