నలుగురు హీరోయిన్స్ తో వెంకటేష్..!

బాబు బంగారంతో మళ్లీ ఫాంలోకి వచ్చిన వెంకటేష్ ప్రస్తుతం గురు సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ కల్లా ఆ సినిమాను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న వెంకటేష్ ఆ తర్వాత చేయబోయే ఆడాళ్లు మీకు జోహాలు సినిమాను చేస్తున్నాడు. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాలో నలుగు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడట వెంకటేష్. నిత్యా మీనన్ ఇప్పటికే ఓ హీరోయిన్ కాగా మరో ముగ్గురి కోసం అన్వేషణలో ఉన్నారట.

ఇక ఆ ముగ్గురు తేజశ్వి, సింగర్ సునీత, యాంకర్ అనసూయ అని అంటున్నారు. అదే కనుక నిజమైతే సినిమా హీరోయిన్స్ తోనే ఆడేస్తుందని చెప్పేయొచ్చు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సునీత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తుంది. ఇక జబర్దస్త్ ఫాంలో ఉన్న అనసూయ కూడా అభిమానులను అలరించేందుకు రెడీ అవుతుంది. సో ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఆడాళ్లు మీకు జోహార్లు ఏ విధంగా ఆడియెన్స్ ను అలరిస్తుందో చూడాలి. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి నుండిర్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.