బాలయ్య-పవన్‌ కళ్యాణ్‌ అన్‌స్టాపబుల్‌ ప్రమో

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్‌ టాక్ షోలో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఎపిసోడ్‌కి షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రసారం కానున్న ఆ ఎపిసోడ్‌ ప్రమోని ఆహా ఓటీటీ విడుదల చేసింది. అయితే దానిలో పవన్‌ కళ్యాణ్‌ సెట్లోకి రావడం, తర్వాత బాలయ్య ‘నీ కొలతలు కావాలంటూ’ పవన్‌ కళ్యాణ్‌ని ఆటపట్టించడం వరకు మాత్రమే ప్రమోలో చూపారు. 

ఈ టాక్ షోలో మొట్టమొదట చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లతో మొదలుపెట్టిన్నప్పుడే అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2 సూపర్ హిట్ అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌కి ముందు ప్రభాస్‌తో బాహుబలి పేరుతో బాలయ్య చేసిన రెండు ఎపిసోడ్స్ విడుదల చేయగా అవీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటు సినిమాలలో, అటు రాజకీయాలలో కూడా ఉన్న పవన్‌ కళ్యాణ్‌తో చేసిన ఈ ఎపిసోడ్‌ ఎలా ఉంటుందో అని అభిమానులతో సహా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఎప్పుడు ప్రసారం అవుతుందో ఇంకా ప్రకటించలేదు కానీ ఈ నెల 26న గణతంత్ర దినోత్సవంనాడు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.