
అమెరికాలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రధానోత్సవానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి తదితరులు తమ జీవితభాగస్వాములతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ వారు చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. రామ్ చరణ్ భార్య ఉపాసన ఆ కార్యక్రమంలో తామందరం పాల్గొన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేస్తూ, “ఆర్ఆర్ఆర్ టీమ్‌లో నేను భాగస్వామినైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాకి ఈ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకోనందుకు చాలా గర్వంగా ఉంది. జై హింద్! ఆర్ఆర్ఆర్ టీమ్‌లో నన్ను భాగస్వామిని చేసినందుకు రాజమౌళి , రామ్ చరణ్ ఇద్దరికీ ధన్యవాదాలు. నాతో పాటు నాకు పుట్టబోయే బేబీ కూడా ఈ గొప్ప అనుభూతిని పొందుతుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆలోచన నాకు ఎంతో భావోద్వేగం కలిగిస్తోంది,” అని ట్వీట్ చేశారు.
Such an honour to be a part of the #RRR family.
Proudly winning for Indian Cinema #jaihind
Thank u @AlwaysRamCharan & @ssrajamouli Garu for making me part of this journey.
I’m sooo happy my baby can experience this along with me 🤗❤️
I’m soooooo emotional 🥹 @rrrmovie pic.twitter.com/ng6IXeULBY