మార్చి 12వ తేదీన లాస్ ఏంజలీస్ నగరంలో డల్బీ థియేటర్‌లో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుల కోసం యావత్ ప్రపంచదేశాలకు చెందిన సినిమాలు పోటీ పడుతుంటాయి. భారత్ నుంచి కూడా అనేక సినిమాలు ఆస్కార్ బరిలోకి దిగాయి. అయితే భారత్ నుంచి 10 సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ జాబితాలో చోటు దక్కించుకొన్నాయి. ఆ జాబితాని ఆస్కార కమిటీ ప్రకటించింది.
ఆ జాబితాలో నిలిచిన భారతీయ సినిమాలు ఇవే: 1. చల్లో షో (గుజరాతీ), 2. ఆర్ఆర్ఆర్ (తెలుగు), 3. కాశ్మీరీ ఫైల్స్ (హిందీ), కాంతార (కన్నడ), విక్రాంత్ రోణ (కన్నడ), గంగూభాయి కతీయవాడి (హిందీ), మి వసంత రావ్ (మరాఠీ), తూజ్య సాధి కహీ హై (మరాఠీ), రాకెట్రీ (తమిళ్), ఇరవిన్ నిళల్ (తమిళ్). ఇవి కాక వివిదదేశాలకు చెందిన మరో 301 సినిమాలు ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతున్నాయని ఆస్కార్స్ కమిటీ తెలియజేసింది. ఈ 311 సినిమాలలో నుంచి 95వ ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన చిత్రాలను ఈనెల 24వ తేదీన ప్రకటిస్తారు.
ఆర్ఆర్ఆర్ సినిమా అనేక విభాగాలలో పోటీ పడగా కేవలం నాటునాటు పాట (ఉత్తమ ఒరిజినల్ సాంగ్) మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యింది. కాంతారా సినిమా మాత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాలలో షార్ట్ లిస్ట్ అయ్యింది.