యశోద సినిమా చేస్తున్నప్పుడు అరుదైన మయో సైటిస్ వ్యాధి బారిన పడిన ఆ సినిమా తర్వాత ఆ వ్యాధికి ఆయుర్వేద చికిత్స తీసుకొని కొంతవరకు కోలుకొన్నారు. అందుకే మొన్న శాకుంతలం సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పుడు ఆమె చేతిలో ఓ జపమాలతో కనిపించారు. పూలనావలా సాగిపోతున్న ఆమె జీవితంలో నాగ చైతన్యతో విడాకులు పెద్ద కుదుపుకి లోనయింది. అతికష్టం మీద ఆ బాధ, ఆవేదన నుంచి కోలుకొని మళ్ళీ ధైర్యంగా ముందుకు సాగుతుంటే అరుదైన మయో సైటిస్ వ్యాధి సోకింది. మనిషిని నిలబడలేని, కూర్చోలేనంతగా బలహీనపరిచే ఆ వ్యాధికి ఎటువంటి మందులు లేకపోవడంతో సమంతకి మరో పెద్ద షాక్ అనే చెప్పాలి. ఒక మనిషి జీవితంలో ఇంత తక్కువ సమయంలో వరుసగా ఇన్ని సమస్యలను, సవాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టమే. కానీ ఒంటరి పోరాటం చేస్తున్న సమంత మాత్రం ఒకదాని తర్వాత మరొకటిగా వస్తున్న కష్టాలను ఎదుర్కోక తప్పడం లేదు.
ఆధ్యాత్మిక గురువులని ఆశ్రయించి వారి సలహాతో జపం, ధ్యానం, ప్రాణాయామం వంటివి చేస్తున్నారు. అందుకే జపమాలని చేతిలో ఉంచుకొని తిరుగుతున్నారు. ఆరోగ్యసమస్య కారణంగా ఒత్తిడికి గురికాకుండా మనసుని నిశ్చలంగా ఉంచుకొనేందుకు జపమాలతో జపం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సమంత తన తాజా ఫోటోని ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో షేర్ చేసుకొంటూ, మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన ఓ అద్భుతమైన కొటేషన్ని దానికి జోడించారు. “నమ్మకంతో మొదటి అడుగు వెయ్యి. దాని కోసం నువ్వు మొత్తం మెట్లన్నిటినీ చూడాల్సిన అవసరం లేదు. కేవలం మొదటి అడుగు వేసి ప్రారంభించు.”