
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు విజయ్ హీరోగా తీసిన వారసుడు సినిమా ఈ నెల 11న విడుదల చేయవలసి ఉండగా దానిని ఈనెల 14కి వాయిదా వేస్తున్నట్లుఆ సినిమా నిర్మాత దిల్దిల్రాజు ఆదివారం ప్రకటించారు. నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, సినిమాలు వరుసగా జనవరి 12,13 తేదీలలో విడుదలకాబోతునందున తన సినిమాని వాటి తర్వాత 14వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించిన్నట్లు దిల్‌రాజు తెలియజేశారు.
వారసుడు సినిమాలో విజయ్‌కి జోడీగా రష్మిక మందన నటించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా రన్ టైమ్ 2.43 నిమిషాలు.
సంక్రాంతికి ముందు విడుదలవుతున్న వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల మద్య గట్టి పోటీ నెలకొని ఉండగా, కోలీవుడ్ హీరోలు విజయ్, అజిత్ నటించిన ‘వారిసు’, ‘తునివు’ (తెలుగులో తెగింపు) సినిమాల మద్య కూడా ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కడ తమిళనాడులో పోటీ నెలకొని ఉంది.