బాఫ్టా అవార్డు బరిలో ఆర్ఆర్ఆర్‌

అంతర్జాతీయ సినిమాలకు ఆస్కార్ ఎటువంటిదో, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) ఇచ్చే అవార్డు కూడా అటువంటిది. హాలీవుడ్ కూడా ఈ అవార్డులని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటుంది. అన్ని దేశాలు ఈ అవార్డ్ కోసం పోటీ పడుతుంటాయి. కనుక ఏటా 5 ఆంగ్లేతర సినిమాలను కూడా వివిద కేటగిరీలలో ఎంపిక చేసి అవార్డు ఇస్తుంటుంది.

ఈసారి బాప్టా అవార్డుల కోసం 49 సినిమాలను పరిశీలించి వాటిలో 10 ఆంగ్లేతర సినిమాలను బాప్టా కమిటీ నామినేషన్ కోసం ఎంపిక చేసింది. వాటిలో ఆర్ఆర్ఆర్‌ కూడా ఒకటి. ప్రపంచదేశాలతో పోటీ పడి ఈ జాబితాలో నిలవడం చాలా గొప్ప విషయంగా భావిస్తారు.

త్వరలోనే బాప్టా కమిటీలో సభ్యులు ఈ 10 సినిమాలపై ఓటింగ్ నిర్వహించి వాటిలో 5 సినిమాలను ఎంపిక చేస్తారు. వాటికి బాప్టా అవార్డులు లభిస్తాయి. బాప్టా అవార్డుల ప్రధానోత్సవం జనవరి 19న జరుగుతుంది.  

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల రేసులో కూడా ఆర్ఆర్ఆర్‌ నిలిచిన సంగతి తెలిసిందే. ఆస్కార్ నామినేషన్స్ కోసం ఎంపిక చేసిన నాలుగు భారతీయ సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్‌ కూడా నిలిచింది. ఈ సినిమాలో కీరవాణి సంగీతం అందించిన నాటునాటు పాటని ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయ్యింది. 

ఇది కాక భారత్‌ తరపున అధికారికంగా నామినేట్ అయిన గుజరాతీ చిత్రం చెల్లో షో (ది లాస్ట్ షో)ని ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ఎంపికైంది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో “ఆల్ దట్ బ్రీత్స్”, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో “ఎలిఫెంట్ విష్పరర్” ఎంపికయ్యాయి. 

ఆస్కార్ కోసం షార్ట్ లిస్ట్ అయిన ఈ జాబితాలో ఇంకా వివిద దేశాలకు చెందిన చిత్రాలు కూడా ఉంటాయి. వాటన్నిటిపై జనవరి 12 నుంచి 17వరకు ఓటింగ్ నిర్వహించి, వాటిలో ఎన్నికైన వాటిని ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపిక చేస్తారు. మళ్ళీ వాటిలో నుంచి ఆస్కార్ అవార్డ్స్ కమిటీ సభ్యులు వివిద విభాగాలలో అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేసి, మార్చి 12న లాస్ ఏంజలీస్ నగరంలోని డల్బి థియేటర్‌లో జరిగే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో అవార్డులు అందజేస్తారు.