వీరసింహా రెడ్డి ట్రైలర్‌... ప్యూర్ బాలయ్య మార్క్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్‌ జోడీగా నటించిన వీరసింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌ నిన్న ఒంగోలులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్‌తో తెరకెక్కించిన ఈ సినిమా పూర్తిగా బాలయ్య మార్క్ డైలాగ్స్, ఫైట్స్‌తో కూడిన పక్కా కమర్షియల్ సినిమా అని ట్రైలర్‌ చూస్తే అర్దమవుతుంది. కనుక సంక్రాంతి పండుగకి ముందు జనవరి 12న వస్తున్న ఈ సినిమా బాలయ్య అభిమానులకి మరో పండుగే అవుతుంది. 

ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్, లాల్, చంద్రికా రవి తదితరులు కీలకపాత్రలు చేశారు. 

నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వీరసింహారెడ్డి సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, కెమెరా: రిషి పంజాబీ, ఎడిటింగ్: నవీన్ నూలి, సంగీతం: ఎస్.ధమన్ అందించారు.