వారసుడు ట్రైలర్‌.. విజయ్‌ మార్క్ బిజినెస్!

కోలీవుడ్ నటుడు విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన వారసుడు చిత్రం ఈ నెల 12న సక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతోంది. కనుక సినిమా ట్రైలర్‌ చూపించేశారు నిర్మాత దిల్‌రాజు.  ట్రైలర్‌ చూస్తే ఈ సినిమా పూర్తిగా విజయ్‌ మార్క్ స్టైలిష్ అండ్ కమర్షియల్ సినిమా అని అర్దమవుతుంది. ఓ ఫ్యామిలీ బిజినెస్‌లో అన్నదమ్ములు… వారికో బాధ్యత లేని తమ్ముడు. వారి బిజినెస్‌ని దెబ్బతీయడానికో ఓ విలన్, ఆ విలన్ నుంచి తన కుటుంబాన్ని, ఫ్యామిలీ బిజినెస్‌ని కాపాడుకోవడానికి బాధ్యతలేని తమ్ముడు హీరోగా మారి విలన్లందరినీ చిత్తుచిత్తుగా ఇరగ్గొట్టేయడం... మరోలా చెప్పాలంటే మరో అల వైకుంఠపురంలో... కాకపోతే విజయ్‌ స్టైల్లో అంతే! 

ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా రష్మిక మందన చేసింది. ఇంకా ప్రకాష్ రాజ్,జయసుధ, సుమన్, ఆర్‌.శరత్ కుమార్, ప్రభు, శ్రీకాంత్, శామ్, ఖుష్బూ, యోగిబాబు, సంగీత, సంయుక్త షణ్ముఘనాధన్, నందిని రాయ్, శ్రీమాన్, భారత్ రెడ్డి, సతీష్, మాథ్యూ వర్గీస్, హర్షిత, అద్వైత, జాన్ విజయ్, విటివి గణేశ్, సంజన సారథి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకి కధ: వంశీ పైడిపల్లి, హరి, ఆశీషోర్ సోలమన్, డైలాగ్స్: వివేక్, కెమెరా: కార్తీక్ పళని, సంగీతం: థమన్ అందించారు.