
బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్ జంటగా వస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమా సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ యు/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. దీనిలో పాటలకి చిరంజీవి చేసిన డ్యాన్సులు అద్భుతంగా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ సభ్యులు మెచ్చుకొన్నారు. యూఎస్‌లో ఈ సినిమాని విడుదల చేస్తున్న శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్ అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టేసింది. జనవరి 12న ప్రీమియర్ షోలు వేయబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. యూఎస్‌లో 67 థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి ఆ జాబితాని కూడా విడుదల చేసింది.
వాల్తేర్ వీరయ్య సినిమాలో మాస్ మహారాజ రవితేజ పోలీస్ ఆఫీసర్‌హా కీలక పాత్ర చేశాడు. రాజేంద్ర ప్రసాద్, కేథరిన్ ధెరిసా, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు.
నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం: బాబి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి, కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందించారు.