వీరసింహారెడ్డి… మాస్ మొగుడు లిరికల్ సాంగ్‌ నేడే విడుదల

నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్‌ జంటగా జనవరి 12న వస్తున్న వీర సింహారెడ్డి చిత్రంలో మూడు పాటలు రిలీజ్‌ అయ్యాయి. మంగళవారం రాత్రి 7.55 గంటలకి బాలకృష్ణ, శ్రుతీ హాసన్‌ మీద చిత్రీకరించిన ‘మాస్ మొగుడు’ లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్‌ కాబోతోంది. దీని తర్వాత జనవరి 6వ తేదీన వీర సింహారెడ్డి సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ కాబోతోంది. 

ఇప్పటివరకు రిలీజ్‌ చేసిన మూడు పాటలలో “మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి...” అనే పాటకి మంచి ఆదరణ లభిస్తోంది. సుగుణ సుందరి... పాటలో బాలయ్య, శ్రుతీ హాసన్‌ వేసిన స్టెప్పులకి కూడా మంచి స్పందన వస్తోంది. కనుక ఈ ‘మాస్ మొగుడు’ పాట, దానికి వారిద్దరి డ్యాన్స్ ఏవిదంగా ఉంటుందో అని బాలయ్య అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరసింహా రెడ్డి చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్, లాల్, చంద్రికా రవి తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుమారు రూ.70 కోట్లు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కెమెరా రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం ఎస్.ధమన్ అందించారు.