రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రాణా ప్రధాన పాత్రలలో బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చింది. ఆ సినిమాయే కాదు... బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో ప్రభాస్, గోపీ చంద్ పాల్గొన్న ఎపిసోడ్ కూడా రెండు భాగాలుగా వస్తుండటం విశేషం. దానిలో మొదటి ఎపిసోడ్‌కి సంబందించి ప్రమోని ఆహా ఓటీటీ విడుదల చేసింది. ప్రభాస్‌ని అందరూ అడిగే ప్రశ్న “ఇంకా ఎప్పుడు పెళ్ళి చేసుకొంటావు?” అని బాలయ్య కూడా అడిగితే “రాసి పెట్టినప్పుడు...” అంటూ రొటీన్ సమాధానం ఇచ్చి తప్పించుకొన్నారు. “స్నేహితులు నిన్నేమని పిలుస్తారు?” అంటే ప్రభాస్ ఏమాత్రం తడుముకోకుండా ‘డార్లింగ్’ అని సమాధానం చెప్పారు. “మరి అమ్మాయిలో?” అని బాలయ్య ప్రశ్నించేసరికి “ఏమో సార్ ఈ మద్యన ఏదో ట్యాబ్లెట్ వేసుకొంటున్నాను సరిగ్గా గుర్తు రావడం లేదు,” అంటూ సమాధానం చెప్పడంతో ఈ షోలో పాల్గొన్న ఆడియన్స్ అందరూ పకపక నవ్వారు. బాలయ్య, ప్రభాస్, గోపీ చంద్ ముగ్గురూ ఈ షోలో చాలా సందడి చేసినట్లున్నారు. అందుకే దీనిని రెండు ఎపిసోడ్స్‌లో చిత్రీకరించిన్నట్లుంది. ఈ బాహుబలి మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30వ తేదీన ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోంది.