బాలయ్య హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ సీజన్-2లో జనవరి 13వ తేదీన ప్రసారం కాబోయే తర్వాత ఎపిసోడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఊహించిన్నట్లే ఆయనతో దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ కూడా వచ్చారు కానీ కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోగానే దర్శకుడు క్రిష్ వచ్చి చేరారు. వారిద్దరితో బాలయ్య సందడి చేస్తుండగా హటాత్తుగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. దాంతో షో ఇంకా రక్తి కట్టించారు బాలయ్య.
వారు నలుగురు కలిసి ఉత్సాహంగా షో చేస్తుండగా చివరిలో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కూడా ప్రవేశించడంతో బాలయ్య అభిమానులు చాలా పొంగిపోయారు. మోక్షజ్ఞ పవన్ కళ్యాణ్ వద్దకి వచ్చి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకొన్నాక అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకొన్నాక ఈ ఎపిసోడ్ ముగించేశారు.
మరో రెండు మూడు రోజులలో ఈ తాజా ఎపిసోడ్ తాలూకు ప్రమో విడుదల కాబోతోంది. అప్పుడు బాలయ్య పవన్ కళ్యాణ్‌ని ఏం ప్రశ్నలు అడిగారో వాటికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానాలు చెప్పారో తెలుస్తుంది. అలాగే 2024లో మోక్షజ్ఞ సినిమాలలో ఎంట్రీ ఇస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ఈ ఎపిసోడ్లో ఆ విషయం ఏమైనా చెప్పాడా? లేదా అందుకే అతనిని బాలయ్య ఈ షోకి రప్పించారా?అనే ప్రశ్నలకు ప్రమోలో సమాధానాలు లభించవచ్చు.