సారీ! రవితేజ గురించి ప్రెస్‌మీట్‌లో మాట్లాడటం మరిచిపోయా: బాబీ

వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్‌ నిన్నటితో ముగియడంతో నిన్న సాయంత్రం చిత్ర బృందం సినిమా సెట్‌లోనే వెరైటీగా ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ తనకు చిరంజీవి, ఆయన సినిమాలంటే ఎంత పిచ్చో వివరిస్తూ ఓ వీరాభిమానిగా ఈ సినిమాని తీశానని చెప్పాడు. బాబీ ఈ సినిమాలో చేసినవారందరి గురించి మాట్లాడాడు కానీ రవితేజ గురించి మరిచిపోయాడు. ఇదే విషయం తర్వాత గుర్తుకువచ్చిన్నప్పుడు చాలా బాధపడ్డానని చెపుతూ ట్విట్టర్‌లో ఓ సందేశం పెట్టారు. దానిలో ఈరోజు జరిగిన ప్రెస్‌మీట్‌లో నేను చాలా క్లుప్తంగా మాట్లాడుదామనుకొన్నాను. ఆ కారణంగా ఈ సినిమాకి అత్యంత కీలకమైన రవితేజ గురించి చెప్పడం మరిచిపోయాను. తర్వాత ఏదో వెలితిగా అనిపిస్తే అప్పుడు నేను నా తమ్ముడు రవితేజ గురించి మాట్లాడలేదని గుర్తుకొచ్చి వెంటనే ట్విట్టర్‌లో ఈ సందేశం పెడుతున్నా. త్వరలోనే రవితేజ గురించి వివరంగా మాట్లాడుకొందాము,” అంటూ ట్వీట్ చేశాడు. 

గతంలో చిరంజీవితో దిగిన ఓ ఫోటో గురించి కూడా దర్శకుడు బాబి చెపుతున్నప్పుడు చిరంజీవి చాలా భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే వచ్చి బాబీని పట్టుకొని నవ్వుతూ ఫోటో దిగారు.