బాలయ్య, పవన్‌ కళ్యాణ్‌ అన్‌స్టాపబుల్‌

ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ సీజన్-2 నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా రచ్చరచ్చ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. సీజన్-2 తొలి ఎపిసోడ్‌లోనే తన వియ్యంకుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు నారా లోకేష్‌లతో ఆడేసుకొన్న బాలకృష్ణ, ఇప్పుడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో ఆడుకోబోతున్నారు. ఈ ఎపిసోడ్‌ షూటింగ్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. దానిలో పాల్గొనేందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ని బాలయ్య ఎదురేగి ఆప్యాయంగా కౌగలించుకొని స్వాగతం పలికారు. ఆ ఫోటోలని ఆహా సంస్థ ప్రతినిధి శ్రీధర్ శ్రీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పవన్‌ కళ్యాణ్‌, ఈ అన్‌స్టాపబుల్‌ షోలో పాల్గొబోతున్నారని తెలిసి బాలయ్య, పవన్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో పోస్టర్స్ తయారుచేసి పోస్ట్ చేస్తున్నారు. బాలయ్య-పవన్‌ కళ్యాణ్‌ల ఈ షో సంక్రాంతి పండుగ రోజున ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌తో పాటు దర్శకులు క్రిష్, త్రివిక్రం శ్రీనివాస్‌ కూడా ఈ షోలో పాల్గొంటారని సమాచారం.