అతనితోనే అనుష్క పెళ్ళట..!

కమర్షియల్ సినిమాలు చేస్తూ సడెన్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు కెరియర్ టర్న్ చేసిన అనుష్క లేకుంటే ఓ అరుంధతి, రుద్రమదేవి సినిమాలు వచ్చేవే కావు. ఏ హీరోయిన్ పడలేని కష్టం తాను పడి ఆ సినిమాల్లో నటించి మెప్పించింది అనుష్క. అందుకే సౌత్ లో ఆమెకు ఏ హీరోయిన్ సాటిరాని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చేసరికి వయసుని కూడా లెక్క చేయలేదు. తీరా చూస్తే 34 ఏళ్ల దాకా వచ్చాయి.

అందుకే పెళ్లి మీద మనసు మళ్లించుకుంది అనుష్క. ఆర్యతో ప్రేమాయణమని.. తెలుగు దర్శకుడితో లవ్ అని ఏవేవో రూమర్లు వచ్చినా వాటిలో ఏది నిజం కాదని తెలిసింది. అయితే కొద్దిరోజులుగా అనుష్క ఓ నిర్మాత ప్రేమలో ఉన్నదని టాక్. హైదరాబాద్ లో బిజినెస్ తో పాటుగా సినిమాలను నిర్మిస్తున్న ఓ ప్రొడ్యూసర్ తో అనుష్క పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ప్రస్తుతం చేస్తున్న బాహుబలి-2, సింగం-3, భాగమతి, ఓ నమో వెంకటేశాయ సినిమాలు పూర్తి కాగానే అనుష్క పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. సో ఈ లెక్కన చూసుకుంటే వచ్చే ఏడాది అనుష్క పెళ్లి భాజాలు మోగించడం ఖాయమనే చెప్పొచ్చు. మరి అనుష్క ప్రేమని దక్కించుకున్న ఆ బడా బిజినెస్ మేన్ ఎవరో మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.