మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల?

పెళ్ళి సందD సినిమా పెద్దగా ఆడనప్పటికీ దాంతో తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు మంచి గుర్తింపే లభించింది. మంచి నటన, అందచందాలు, వాటిని ఆరబోసేందుకు వెనకాడకపోవడంతో ఆమెకు వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయి. మాస్ మహారాజ రవితేజతో కలిసి మరో ధమాకా సృష్టించేందుకు డిసెంబర్‌ 23న వస్తోంది. రామ్ చరణ్‌-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో రామ్‌కి జోడీగా నటించబోతోంది. అదీగాక మరో రెండు తెలుగు సినిమాలకు శ్రీలీల సంతకాలు చేసింది.

ఇప్పుడు శ్రీలీలకి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో శ్రీలీలకి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే ఫస్ట్ హీరోయిన్‌గా సెలెక్ట్ కాగా శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా సెలక్ట్ అయినట్లు తాజా సమాచారం. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించవలసి ఉంది. ఒకవేళ ధమాకా సినిమా హిట్ అయ్యి మహేష్ బాబుతో సినిమా ఖరారైతే ఇక శ్రీలీల టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ స్టేటస్ వచ్చేసినట్లే. ఆ తర్వాత దర్శకనిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడతారు.