
నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా ధమాకా చిత్రం లిరికల్ వీడియో సాంగ్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన 'డూడూడూ...' అంటూ సాగే ఈ పాటను పృధ్వీ చంద్ర చాలా అద్భుతంగా పాడగా భీంస్ సెసీరోలియో అత్యద్భుతమైన మ్యూజిక్ అందించారు. దానికి శేఖర్ విజే మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ ఈ పాటను మరోస్థాయికి తీసుకుపోయిందని చెప్పవచ్చు. ఇక రవితేజ డ్యాన్స్ గురించి చెప్పక్కరలేదు. తాజా ట్రెండ్ ప్రకారం ఈ వీడియో చివరిలో ధమాకా మేకింగ్ వీడియోని కూడా చూపించారు.
ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్నపాత్రలలో నటిస్తున్నాడు. ఒకటి మద్యతరగతి వ్యక్తిగా మరొకటి సూటుబూటు వేసుకొని చాలా స్టయిలిష్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు నక్కిన త్రినాధరావు. ధమాకాలో తనికెళ్ళ భరణి, రావు రమేష్, అలీ, ప్రవీణ్, చిరాగ్ జానీ, హైపర్ ఆది, జయరాం, సచిన్ ఖేడేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ధమాకాని టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: ప్రసన్నకుమార్ బెజవాడ, పాటలు: రామజోగ్గయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, సుద్ధాల అశోక్ తేజ్, సంగీతం: భీంస్ సెసీరోలియో, కొరియోగ్రఫీ: శేఖర్ విజే జానీ మాస్టర్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని; స్టంట్స్: రామ్, లక్ష్మణ్.
డిసెంబర్ 23వ తేదీన రవితేజ ఈ ధమాకాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.