కాజల్ వాటి జోలికే పోదట..!

సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న కాజల్ మొన్నామధ్య కెరియర్ ముగించేసేయడమే అన్న పరిస్థితి కనబడ్డా మళ్లీ వరుస స్టార్ హీరోల అవకాశాలతో కెరియర్ ఊపందుకుంది. అయితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ అందరు ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. అయితే వాటి గురించి కాజల్ ను అడిగితే మాత్రం బాబోయ్ ఫీమేల్ లీడ్ సినిమాలా నాకు అంత సీన్ లేదండి అనేస్తుంది. అదేంటి అంటే సినిమా మొత్తం తన క్యారక్టర్ మీదే నడుస్తుంది దాన్ని తాను బేర్ చేయలేను అంటుంది కాజల్.

ఏదో హీరోల పక్కన చేయమంటే చేసేస్తా తప్ప ఫుల్ లెంథ్ క్యారక్టర్ చేయాలన్న కోరిక కూడా తనకు లేదట. అంతేకాదు ఇప్పటికే అలాంటి అవకాశాలు ఒకటి రెండు వచ్చినా కాదు అని కరాఖండిగా చెప్పేసిందట. మరి కాజల్ నిర్ణయం సరైనదో కాదో తెలియదు కాని ఆమె మాత్రం తను లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఏమాత్రం పనికిరాను అని డిసైడ్ అయ్యింది. ఇక ఈమధ్య చేసిన జనతా గ్యారేజ్ పక్కా లోకల్ సాంగ్ తో ఐటంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కాజల్ ఆ సినిమా హిట్ లో ఆ ఐటం కూడా భాగమవ్వడంతో వరుసగా అలాంటి ఐటం ఆఫర్లే వస్తున్నాయని బాధపడుతుంది. 

అదేదో తప్పక చేశా కాని ఇక నుండి ఐటం సాంగ్స్ కూడా చేసేది లేదు అనేస్తుంది కాజల్. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాలో నటిస్తున్న అమ్మడు వరుసగా తెలుగు తమిళ భాషల్లో స్టార్ సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తుంది.