
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను సర్కార్-3 సెట్స్ లో నందమూరి బాలకృష్ణ కలవడం జరిగింది. ప్రస్తుతం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్న బాలయ్య బాబు ఆ సినిమా తర్వాత చేసే రైతు సినిమాలో ఓ క్రూషియల్ రోల్ అమితాబ్ తో చేయించే ప్రయత్నంలో భాగంగా సినిమా దర్శకుడు కృష్ణవంశీ బాలకృష్ణలు రీసెంట్ గా అమితాబ్ ను కలిశారు. అంతేకాదు రైతు కథ అందులోని తన పాత్రను చూచాయగా చెప్పి వచ్చారట.
అమితాబ్ కూడా కొద్దిగా ఆలోచించి చెబుతానని అన్నారట. దాదాపు అమితాబ్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వర్మ సర్కార్-3 షూటింగ్ లో ఉన్న అమితాబ్ అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపించడం జరిగింది. కింగ్ నాగార్జున మనం సినిమాలో అమితాబ్ చివరగా కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్ కు ధీటుగా సినిమాలను తీస్తున్న టాలీవుడ్ నుండి ఏ చిన్న ఆఫర్ వచ్చినా సరే బీ టౌన్ స్టార్స్ కూడా ఓకే చెప్పేస్తున్నారు. మరి బాలయ్య అమితాబ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.