నాని సినిమా... అంటే నాని నటించిన సినిమా అని కాదు నాని సమర్పిస్తున్న సినిమా ఒకటి నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. నాని సోదరి దీప్తి గంట దర్శకత్వంలో తీసిన ‘మీట్ క్యూట్’ అనే సినిమాను సోనీలివ్ ఓటీటీలో ఆదివారం విడుదల కాబోతోంది. వాల్ పోస్టర్‌ను సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిరినేని ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునయన, సంచితహ్ పూనచ, అశ్విని కుమార్, శివ కందుకూరి, దేక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకు కెమెరా వసంత్ కుమార్, సంగీతం విజయ్ బల్గానిన్ అందించారు.
దర్శకుడు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్ జంటగా దసరా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది 2023, మార్చి 30న రిలీజ్ అవుతోంది. దసరా పండుగ సందర్భంగా విడుదల చేసిన మాస్ బీట్ సాంగ్ ‘ధూమ్ ధామ్’ అనే చాలా ఆకట్టుకొంది. సిల్క్ బార్ వద్ద సాగే సాంగ్ కనుక చాలా నాటుగా మోటుగా కూడా ఉంది.
సింగరేణి బొగ్గు కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. దీనిలో నాని బొగ్గుగాని కార్మికుడిగా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సముద్రఖని, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, జారీనా వాహేబ్, షమ్నా ఖాసీం , రోశన్ మాథ్యూ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు కెమెర: సత్యన్ సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.