జూ.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘దేవర’ అనే టైటిల్ పోస్టర్‌ను ఖరారు చేసినట్లు తాజా సమాచారం. నిర్మాత బండ్ల గణేశ్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌తో దేవర పేరుతో సినిమా తీయాలనే ఆలోచనతో ఈ టైటిల్ పోస్టర్‌ను రిజిస్టర్ చేయించాడు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అయిపోవడంతో ఒప్పుకొన్న సినిమాలను కూడా పూర్తి చేయలేకపోతున్నారు. కనుక పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా పట్టలెక్కే అవకాశం లేకపోవడంతో కొరటాల శివ బండ్ల గణేశ్‌తో మాట్లాడి ఆ టైటిల్ జూ.ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాకి హీరోయిన్, ఇతర నటీనటుల పేర్లు ఇంకా ప్రకటించవలసి ఉంది. ఈ సినిమాకు కెమెరా రత్నవేలు, సంగీతం అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. సినిమా హీరోయిన్, మిగిలిన నటీనటుల పేర్లు ఇంకా ప్రకటించవలసి ఉంది.