నాగార్జునకు 'శివ'.. నాగ చైతన్యకు 'ప్రేమమ్'..!

నాగ చైతన్య హిట్ అందుకున్న ప్రేమం మూవీ సక్సెస్ మీట్ లో నాగార్జున చిత్రయూనిట్ ను ప్రసంశలతో ముంచెత్తారు. సినిమా వన్ వీక్ ముందు చూసి ట్వీట్ కూడా చేశా హ్యాపీగా ఇంటికెళ్తున్న అని.. ఇప్పుడు అదే నిజమైంది. క్లైమాక్స్ శృతి హాసన్ సీన్ లో కళ్ల వెంట నీళ్లు వచ్చాయి.. అదే కాదు సినిమాలో రెండు మూడు చోట్ల అలాంటి సీన్స్ ఉన్నాయి. అవి ఆనందంతో వచ్చే కన్నీళ్లని వాటిని ఆపలేమని అన్నారు నాగార్జున. మలయాళంలో హిట్ అయిన అలాంటి సినిమాను తెలుగులో చేయడానికి గట్స్ ఉండాలి. 

శివనే తీసుకుంటే అది మళ్లీ చైతుతో కాని అఖిల్ తో కాని రీమేక్ చేయొచ్చు కదా అంటారు. అది జరగడం చాలా కష్టం. ప్రేమం కూడా అలాంటి సినిమానే దాన్ని రీమేక్ చేయడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా ఎమోషన్స్ ను అలానే తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా హిట్ అవడానికి దర్శకుడు చందుకి ముందు థాంక్స్ చెప్పాలి అతను తన జాబ్ పర్ఫెక్ట్ గా చేశాడు అన్నారు. నాకు శివ ఎలానో నాగ చైతన్యకు ఈ సినిమా అలానే అన్నారు. 

మలయాళంలో లానే తీస్తే ఇక్కడ ఆడదు.. మన కల్చర్ వేరు కామెడీ వేరు.. పాటలు వేరు కాని వీటన్నిటిని బాలన్స్ చేస్తూ సినిమా తీసాడు చందు. ఇక సినిమాలో నాగ చైతన్య ఇరగదీశాడు. అయితే సినిమా ముందు తమిళ మలయాళ మీడియా విభిన్న కథనాలు చేసింది. రిజల్ట్ చూశాక అందరికి అర్ధం అయ్యిందని అన్నారు.