
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ హీరో కార్తి పోలీస్ ఆఫీసర్‌గా చేసిన సర్దార్ సినిమా అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కలక్షన్స్ కూడా చాలా భారీగా... అంటే రూ.100 కోట్లు పైనే వసూలయ్యాయి. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన సర్దార్ సీమాలో రాశీ ఖన్నా, రాజీష విజయన్, చుంకు పాండే తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకు జార్జ్ సి విలియమ్స్ కెమెరా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు.
ఎపుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ, మీడియా ఫోకస్‌లో ఉండాలని కోరుకొనే పోలీస్ ఇన్‌స్పెక్టరు విజయ్ ప్రకాష్గా కార్తి నటించాడు. ఇటువంటి కాన్సెప్ట్ తో కధ అల్లుకొని ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టమే. కానీ దర్శకుడు పిఎస్ మిత్రన్ ఈ ప్రయత్నంలో విజయం సాధించడమే కాకుండా నిర్మాతకు కలక్షన్స్ కనక వర్షం కురిపించాడు. ఈ సినిమా కార్తి కెరీర్‌లో ఈ సినిమాను మరో మైలురాయిగా నిలిపాడు. ఈ సినిమా ఈనెల 18వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోంది.