తెలుగు సినీ నటుడు నాగశౌర్య హటాత్తుగా పెళ్ళికి సిద్దమైపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని ఈ నెల 20వ తేదీన పెళ్లిచేరుకోబోతున్నట్లు శుభలేఖలు సోషల్ మీడియాలో విడుదల చేశాడు. గత రెండేళ్ళుగా వారిరువురూ ప్రేమించుకొంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వారి సమక్షంలో ఈ నెల 20న ఉదయం 11.25 గంటలకు బెంగళూరులోని విట్టల్ మాల్యా రోడ్డులోగల జెడబ్ల్యూ మారియట్ హోటల్లో నాగశౌర్య-అనూష శెట్టిల వివాహం జరుగబోతోంది.
నాగశౌర్య నటించిన కృష్ణా వ్రిందా విహారి సినిమా విడుదలై ఓ మోస్తరు కలక్షన్స్తో గట్టెక్కేసింది. దాని తర్వాత మరో సినిమా త్వరలో మొదలుపెట్టబోతున్నట్లు చెప్పాడు. కనుక ఆలోగా పెళ్లి పీటలెక్కేస్తున్నాడు.